శ్రీనగర్: హైదరాబాద్‌కు చెందిన జవాన్ జమ్ము కశ్మీర్లో మృతి చెందారు. షోపియాన్ జిల్లాలోని జైనాపోరా సీఆర్పీఎఫ్ శిబిరంలో సురీందర్ సింగ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. మంగళవారం డ్యూటీలో ఉండగా ఆయన అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు.
అధికారులు ఆయనను వెంటనే దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. సురీందర్ మరణానికి గల కారణాలపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.