Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Husband Catches Wife With Lover | కర్వా చౌత్ రోజున ఒక వ్యక్తి భార్య తన ప్రియుడిని కలిసింది. ఇది తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. ప్రియుడితో కలిసి ఉన్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
లక్నో: కర్వా చౌత్ రోజున ఒక వ్యక్తి భార్య తన ప్రియుడిని కలిసింది. ఇది తెలుసుకున్న ఆ వ్యక్తి అక్కడకు చేరుకున్నాడు. ప్రియుడితో కలిసి ఉన్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ, ఆమె భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. (Husband Catches Wife With Lover) ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో కర్వా చౌత్ రోజున ఒక మహిళ తన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వసంత విహార్ ప్రాంతంలో నివసించే ప్రియుడిని ఆమె కలిసింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఆ మహిళ భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ప్రియుడితో కలిసి ఉన్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ, భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ మహిళ ప్రియుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
మరోవైపు ఈ ఘర్షణ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కొట్టుకుంటున్న వారిని నిలువరించారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ దంపతుల విడాకుల వివాదం కోర్టులో ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The husband caught his wife red-handed while she was meeting her lover on Karva Chauth. https://t.co/xVUvr0RBVu
— Pushpraj sharma (@PushprajVibes) October 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

