ముంబై: భార్యను చంపి 17 ముక్కలుగా కోశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహ అనే వ్యక్తిని మహారాష్ట్రలోని భివాండి పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 30న ఈద్గా రోడ్లో ఆమె తల దొరికింది. అంతకు ముందు తన కూతురు కనిపించడం లేదని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రోన్లు, ఫైర్ బ్రిగేడ్ల సాయంతో మృతురాలి మిగతా శరీర భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
ఆమె హత్యకు వాడిన ఆయుధాన్ని, ఘటనా స్థలాన్ని ఇంకా గుర్తించలేదని సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. ఈ ఘటనపై నిందితుడు మిశ్రమ ప్రకటనలు చేస్తుండటంతో విచారణ కోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. భార్యభర్తల మధ్య ఏమైనా గొడవలున్నాయా లేక ఈ హత్య వెనుక వేరే ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.