లక్నో: దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడులు, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు చెలరేగిపోయి హింసకు పాల్పడ్డారు. ఒక హాస్పిటల్, పలు షాపులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. (Bahraich violence) దీంతో పోలీసులు టియర్ గ్యాస్‌షెల్స్ ప్రయోగించి పరిస్థితిని అదుపుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం దుర్గా మాతా విగ్రహం నిమజ్జనం సందర్భంగా మహసీ ప్రాంతం మీదుగా ఊరేగింపు సాగింది. పెద్దగా మ్యూజిక్ ప్లే చేయడంపై ఒక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు జరిపారు. 22 ఏళ్ల హిందూ యువకుడు మరణించగా పలువురు గాయపడ్డారు.
కాగా, ఆందోళనకు దిగిన వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు షాపులు, ఒక హాస్పిటల్‌ను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ అల్లర్ల నేపథ్యంలో దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం నిలిచిపోయింది.
మరోవైపు ఈ ఘర్షణలకు సంబంధించి 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపి వ్యక్తిని సల్మాన్‌గా గుర్తించి అరెస్టు చేశారు. మరో పది మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురిని పోలీసులు గుర్తించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో మహసీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
కాగా, సీఎం యోగి ఆదిత్యనాథ్, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిలిచిపోయిన దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Violence erupted once again in #UttarPradesh‘s #Bahraich as tensions soared during the funeral procession of #RamGopalMishra.
Hospital and vehicles inside an auto showroom were set on fire by the mob, who were seen roaming the streets armed with sticks allegedly. pic.twitter.com/pG4EjKeNYX
— Hate Detector 🔍 (@HateDetectors) October 14, 2024