Porter | బెంగళూరు, ఫిబ్రవరి 7: ప్రజలు తమ తమ గమ్య స్థానాలను చేరడానికి రేపిడో, ఓలా బైక్‌లపై వెళ్లడం మనకు తెలుసు. అయితే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఆఫీస్‌కు వెళ్లేందుకు ఓలా, ఊబర్లు దొరక్కపోవడంతో వినూత్నంగా ఆలోచించాడు. తనను తాను పార్సిల్‌గా పేర్కొంటూ సరుకులు రవాణా చేసే పోర్టర్ కొరియర్‌కు చెందిన బైక్‌ను ఎక్కి ఆఫీస్‌కు చేరుకున్నాడు. పోర్టర్ బైక్‌ల ద్వారా చిన్న చిన్న సామాన్లు, కొరియర్లను నగరంలో రవాణా చేస్తుంటారు. వారు మనుషులను ఎక్కించుకోరు. అయితే తనను తాను ఒక పార్సిల్‌గా పేర్కొంటూ పాథిక్ అనే వ్యక్తి బైక్ బుక్ చేసి ఆఫీస్‌కు చేరుకున్నాడు.