Crime news : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ‘హమారీ అధూరీ స్టోరీ (మా అసంపూర్ణ కథ)’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో తమ రిజిస్టర్డ్ మ్యారేజ్‌కు సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. తన భార్య కుటుంబం వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. బారాబంకి జిల్లాకు చెందిన సుధీర్, ఆయుష్ ఇద్దరూ స్నేహితులు. బారాబంకీ జిల్లా కేంద్రంలో ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. ఈ క్రమంలో ఆయుష్ సోదరి కోమల్‌తో సుధీర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కోమల్, సుధీర్ల ప్రేమకు ఆయుష్ కూడా అండగా నిలిచాడు. అనంతరం కోమల్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా ఆమె పేరెంట్స్ పెళ్లికి అంగీకరించలేదు.
దాంతో మేజర్లు అయిన ఇద్దరూ పెద్దలను ఎదిరించి ఆరు నెలల క్రితం ఫ్యామిలీ కోర్టులో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కోమల్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం కోమల్ కుటుంబం విడాకుల కోసం సుధీర్‌పై ఒత్తిడి తెచ్చింది. కానీ సుధీర్‌కు కోమల్‌ను విడిచిపెట్టడం ఇష్టంలేక విడాకులకు అంగీకరించలేదు. ఈ క్రమంలో కోమల్ కుటుంబం నుంచి సుధీర్‌కు వేధింపులు మొదలయ్యాయి.
ఈ క్రమంలో ఇటీవల కోమల్, కోమల్ తల్లి, సోదరుడు ఆయుష్.. సుధీర్‌ను దూషించారు. కోమల్‌కు విడాకులు ఇవ్వాలని హెచ్చరించారు. విడాకులు ఇవ్వకపోతే ఏమైనా చేసుకుని చావుమని దూషించారు. ఈ క్రమంలో సుధీర్ ‘మా అసంపూర్ణ కథ’ అనే టైటిల్‌తో సూసైడ్ నోట్ రాసి, ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుధీర్ కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.