ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 రాష్ట్రాల సేన చీఫ్‌లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలకు అవసరమైన సాయం చేస్తామని సీఎం షిండే ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖల చీఫ్‌లకు హామీ ఇచ్చారు.
షిండే గ్రూపులో చేరిన పార్టీ రాష్ట్ర చీఫ్ల్లో ఢిల్లీ శివసేన చీఫ్ సందీప్ చౌధరి, మణిపూర్ శాఖ అధ్యక్షుడు టొంబి సింగ్, మధ్యప్రదేశ్ చీఫ్ తదేశ్వర్ మహవర్, చత్తీస్ఘడ్ చీఫ్ ధనంజయ్ పరిహార్, గుజరాత్ చీఫ్ ఎస్ఆర్ పాటిల్, రాజస్ధాన్ చీఫ్ లఖన్ సింగ్ పవార్, హైదరాబాద్ చీఫ్ మురారీ అన్నా, గోవా చీఫ్ జితేష్ కామత్, కర్నాటక చీఫ్ కుమార్ హకరి, బెంగాల్ చీఫ్ శాంతి దత్త, ఒడిషా చీఫ్ జ్యోతిశ్రీ ప్రసన్న కుమార్, త్రిపుర స్టేట్ ఇన్చార్జ్ బరివదేవ్ నాధ్ ఉన్నారు.