న్యూఢిల్లీ: అండమాన్ తీరంలో ఏకంగగా 6 టన్నుల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ చేపల పడవలో తరలిస్తుండగా ఇండియన్ కోస్ట్‌గార్డ్ దీనిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు మయన్మార్ జాతీయులను అరెస్ట్ చేసింది. ఐసీజీకి చెందిన డోర్నియర్ విమానం పైలట్ ఈ నెల 23న బారెన్ ద్వీపంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న పడవను గుర్తించారు. దీంతో ఐసీజీ గగనతల, సముద్ర మార్గాల్లో సమన్వయంతో పని చేసి, ఈ నెల 24న ఈ పడవను పట్టుకున్నారు.
భారతీయ జలాల్లో ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడటం ఇదే మొదటిసారి అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లాది రూపాయలు ఉంటుందని చెప్పారు. అండమాన్, నికోబార్ పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగించనున్నట్లు వివరించారు.