న్యూఢిల్లీ: న్యూస్ క్లిక్(NewsClick)కు ఎన్ని కోట్ల నిధులు అందాయా తెలుసా? ఆ సంస్థకు చైనా నుంచి సుమారు 38 కోట్లు అందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ భావిస్తున్నది. 8 మంది జర్నలిస్టులకు ఆ మొత్తాన్ని జీతాల రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ జర్నలిస్టులనే ఇవాళ ఈడీ విచారించింది. మానవ హక్కుల నేత తీస్తా సెత్లావాద్ కూడా న్యూస్ క్లిక్ సంస్థతో లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సామాజిక కార్యకర్తలు గౌతమ్ నవలఖాకు లీగల్ ఖర్చులను కూడా పెట్టుకున్నారు. బీమా కోరేగావ్ కేసులో గౌతత్పై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ సుమారు పది మంది జర్నలిస్టులపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీంట్లో అయిదు మందిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు తీసుకువచ్చారు. వారి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
యూఏపీఏ(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెక్షన్ యాక్ట్) లో ఉన్న అయిదు సెక్షన్ల కింద న్యూస్ క్లిక్ సంస్థపై కేసు బుక్ చేశారు. దీంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లోని మరో రెండు సెక్షన్లను కూడా జోడించారు. ఇంకా ఎటువంటి కేసులు నమోదు చేశారన్న విషయం తెలియదు. ఐపీసీలోని 153ఏ(రెండు మతాలు, గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 120బీ(నేరారోపణ కుట్ర) కింద కేసులు పెట్టారు.ఇక యూఏపీఏలో సెక్షన్ 13(ఉగ్రవాదం చట్టం కింద శిక్ష), సెక్షన్ 16(టెర్రరిస్టు యాక్టు), సెక్షన్ 17(ఉగ్ర చర్యల కోసం నిధులు సమీకరించడం), సెక్షన్ 18(కుట్ర), సెక్షన్ 22సీ(కంపెనీ నేరాలు) కింద కేసు ఫైల్ చేశారు.