తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
Tauktae Cyclone: తుఫాను సృస్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుఫానుకు ఒక పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది.

న్యూఢిల్లీ: అరేబియా సముద్రం నుంచి తీరానికి దూసుకొస్తున్న తౌక్టే తుఫాను ప్రభావం తీర ప్రాంతాల్లో మొదలైంది. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే తుఫాను సృస్టించే బీభత్సం, ఆస్తి, ప్రాణ నష్టం గురించి చెప్పుకోవడం కోసం ప్రతి తుఫానుకు ఒక పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు ఈ తుఫాన్‌కు తౌటే అని పేరు పెట్టారు.
అసలు ఈ తౌటే అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా..? బర్మా (మయన్మార్) భాషలో తౌటే (Tauktae) అంటే పెద్దగా శబ్దం చేసే బల్లి అని అర్థమట. 2021లో ఏర్పడ్డ ఈ తొలి తుఫాన్‌కు పేరు పెట్టే అవకాశం మయన్మార్‌కు లభించింది. దాంతో మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును ఈ తుఫానుకు పెట్టింది. సాధారణంగా ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఈ ప్రాంతంలోని దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది.
ఈ నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్, పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలు ఉన్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుఫానులకు నామకరణం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

