పండోరి గోలా: పంజాబ్లోని ఓ ఇంటి పైకప్పు (House Collapse)కుప్పకూలింది. ఆ ప్రమాదంలో ఇంట్లో ఉన్న అయిదుగురు కుటుంబసభ్యులు మృతిచెందారు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పండోరి గోలా గ్రామంలో తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఇంటి రూఫ్ కూలినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇంటి పైకప్పుపై.. కొన్ని వ్యర్థ పదార్ధాలు ఉంచడంతో.. ఆ బరువుతో ఇంటి పైకప్పు కూలింది. ప్రమాదం తర్వాత ఇంట్లోవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ అయిదుగురు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.
మృతిచెందిన వారిని గోబిందా, అమర్జిత్ కౌర్, గుర్బాజ్ సింగ్, గురులాల్, ఎక్మాగా గుర్తించారు. మృతదేహాలకు పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.