Delhi | ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న మాట నిజమేనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. అయితే భయపడాల్సిన అవసరం మాత్రం లేదని భరోసా ఇచ్చారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉందని, అందుకే భయపడాల్సిందేమీ లేదని వివరించారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని, ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా కావాల్సినంతగా ఉన్నాయని ఆయన తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పెరుగుతున్నాయి నిజమే. కానీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గింది. మరణాల రేటు తగ్గింది. అన్ని రకాలుగా ప్రభుత్వం సన్నద్ధతో ఉంది. బెడ్స్ అవసరమైనంత మేర అందుబాటులో ఉన్నాయి అని కేజ్రీవాల్ ప్రకటించారు.
మరోవైపు దేశంలో కరోనా పెరిగిపోతోంది. రోజు వారీ సంఖ్య పెరిగింది. గడచిన 24 గంటల్లో దేశంలో 2,64,202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే వీటి శాతం 6.7 శాతంగా ఉంది. కరోనా నుంచి 1,09,345 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. నిన్న ఒక్కరోజే 315 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాజిటివీ రేటు 14.78 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.