Jayant Chaudhary | ఆయన ఇక్కడికి రావద్దు, ఇక్కడి వాళ్లను తాగుబోతులు అనొద్దని ఆశిస్తున్నా: జయంత్ ఛౌదరి
Jayant Chaudhary | కాంగ్రెస్ కీలక నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని ఉద్దేశించి రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) పార్టీ అధ్యక్షుడు జయంత్ ఛౌదరి (Jayant Chaudhary) వ్యంగ్య వ్యాఖ్యాలు చేశారు. ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర వారణాసికి చేరుకున్న సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన సెటైర్లు వేశారు.
Jayant Chaudhary: కాంగ్రెస్ కీలక నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ని ఉద్దేశించి రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) పార్టీ అధ్యక్షుడు జయంత్ ఛౌదరి (Jayant Chaudhary) వ్యంగ్య వ్యాఖ్యాలు చేశారు. ఇటీవల భారత్ జోడో న్యాయ్ యాత్ర వారణాసికి చేరుకున్న సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆయన సెటైర్లు వేశారు.
ఇటీవల వారణాసిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేసింది. వారణాసిలో తన యాత్ర సందర్భంగా జనం తప్పతాగి రోడ్లపై తూలుతూ కనిపించారని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలో పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే, రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. వారణాసి ప్రజలను తాగుబోతులు అంటాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ‘రాహుల్‌గాంధీ యాత్రకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కానీ, ఆయన యాత్రగా ఇక్కడికి రావద్దు, ఇక్కడి ప్రజలను తాగుబోతులు అని కించపర్చవద్దని నేను ఆశిస్తున్నా’ అంటూ జయంత్ ఛౌదరి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇటీవలే జయంత్ ఛౌదరి INDIA కూటమిని వీడి NDA కూటిమిలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

