Narottam Mishra | వాళ్లు ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్ స్లీపర్ సెల్స్.. మధ్యప్రదేశ్ హోంమంత్రి వ్యాఖ్యలు
Narottam Mishra | బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితులను విడుదల చేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో దోషుల విడుదలపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా తీవ్రంగా స్పందించారు. షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాస్ స్లీపర్ సెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.

బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే దేశంలో ఉండేందుకు భయపడుతారంటూ విమర్శించారు. అదే సమయంలో అవార్డ్ వాప్సీ గ్యాంగ్ యాక్టివేట్ అవుతుందని, ఆ తర్వాత గొంతు చించుకుని ఏడవడం మొదలుపెడుతారని అన్నారు. ఈ వ్యక్తులంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, దీన్ని నాగరికత, సెక్యులర్ అని ఎలా అంటారన్నారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను షబానా అజ్మీ ఖండించారు. పరిస్థితి దారుణంగా ఉందన్నారు. దోషుల విడుదల నిర్ణయం పట్ల తాను సిగ్గుపడుతున్నానని, దీనిపై మాట్లాడటానికి తన వద్ద పదాలు లేవని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

