Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం నెలకొంది. అమిత్ షా పెద్ద అక్క రాజేశ్వరి బెన్ షా(60) కన్నుమూసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బీజేపీ ఆఫీస్ బేరర్ వెల్లడించారు.
తన సోదరి మృతి కారణంగా అమిత్ షా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. గుజరాత్‌కు చేరుకుని సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గుజరాత్‌లోని థాల్తేజ్ స్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.