Viral Video: ప్రత్యేక రీతిలో… ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న హోంగార్డ్
ట్రాఫిక్ నియంత్రణలో తాను ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చినట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపాడు. తన ట్రాఫిక్ నియంత్రణ తీరు ప్రజలకు ఎంతో సంతోషం కలుగజేయడంతోపాటు వారిని ఉత్సహాపరుస్తున్నదని చెప్పాడు.
డెహ్రాడూన్: ఒక హోంగార్డ్ ప్రత్యేక రీతిలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. తనదైన స్టైల్లో డ్యూటీని ఆస్వాదిస్తూ వాహనదారులకు కూడా ఆనందం కలుగజేస్తున్నాడు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. హోంగార్డ్ జోగేంద్ర కుమార్, డెహ్రాడూన్‌లోని సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఒక ప్రత్యేక రీతిలో వాహనాల కదలికలను నియంత్రిస్తున్నాడు. చేతులను వినూత్నంగా ఊపుతూ, సంజ్ఞలు చేస్తూ వాహనదారులతో పాటు చూపరులను అతడు ఆకట్టుకుంటున్నాడు.
కాగా, ట్రాఫిక్ నియంత్రణలో తాను ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చినట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపారు. తన ట్రాఫిక్ నియంత్రణ తీరు ప్రజలకు ఎంతో సంతోషం కలుగజేయడంతోపాటు వారిని ఉత్సాహపరుస్తున్నదని చెప్పారు. తన ట్రాఫిక్ నియంత్రణ స్టైల్‌ను ప్రజలు ఆస్వాదిస్తున్నారని ఆయన అన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు వాహనదారులు విసుగు చెందకుండా ఉండేందుకు తాను తనదైన ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ విధానాన్ని ఆచరిస్తున్నట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపారు. తద్వారా తన డ్యూటీని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని ఆయన చెప్పారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Uttarakhand: Jogendra Kumar, a Home Guard deployed as a Traffic Police personnel near City Heart Hospital in Dehradun, controls the vehicular movement of traffic in a unique way. pic.twitter.com/zy2yyrhMio
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

