ముంబై, మార్చి 8 (నమస్తే తెలంగాణ): హిందీ సినిమాలో నటించేందుకు ముంబై వచ్చిన హాలీవుడ్ నటిపై అత్యాచారం జరగడం తీవ్ర సంచలనంగా మారింది. శనివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నది. ఈ నటిని ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు బంగూర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.