Holi Milan : హోలీ పండుగ (Holi festival) ను పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ నేతలు (BJP leaders) హోలీ మిలాన్ (Holi Milan) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయం (BJP office) లో ఈ కార్యక్రమం జరిగింది. ఢిల్లీ బీజేపీకి చెందిన ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal), ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta), బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey), ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ (Virendraa Sachdeva), ఇతర బీజేపీ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా నేతలు ఒకరిపై ఒకరు పూలు చల్లుకున్నారు. డీజే పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేశారు. ఒకరికి ఒకరు హోలీ మిలాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతల సంబురాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.