Smokey Pan | బెంగళూరు : ‘స్మోకీ పాన్’ను తిన్న పన్నెండేళ్ల బాలిక కడుపులో రంధ్రం ఏర్పడింది. దీంతో ఆమెకు గ్యాస్ట్రో సర్జరీ చేయవలసి వచ్చింది. బాలిక కథనం ప్రకారం, లిక్విడ్ నైట్రోజన్‌తో తయారు చేసిన స్మోకీ పాన్‌ను తిన్నవారు నోటి నుంచి పొగలను ఊదుతుండటాన్ని ఆమె గమనించింది. తాను కూడా అలాగే చేయాలనుకుంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌లో విస్తృతంగా లభిస్తున్న స్మోకీ పాన్‌ను కొనుక్కుని, తింది. వెంటనే అస్వస్థతకు గురైంది.
విపరీతంగా కడుపు నొప్పితో బాధపడటంతో ఆమెను దవాఖానకు తరలించారు. తనతోపాటు స్మోకీ పాన్‌ను తిన్నవారు అస్వస్థతకు గురైనప్పటికీ, బాగానే ఉన్నారని ఆమె తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లలో కొన్ని ఆహార పదార్థాలు, పానీయాల్లో లిక్విడ్ నైట్రోజన్‌ను వాడుతున్నారని, అప్రమత్తంగా వ్యవహరించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు.