జైపూర్: బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరంటున్నారు రాజస్థాన్ రాజకీయ నాయకులు.శాసనసభ ఎన్నికల్లో నాలుగుచోట్ల దగ్గరి బంధువులతోనే పోటీ పడుతున్నారు. రామ్‌ఘర్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర చౌదరికి పోటీగా జన్నాయక్ జనతా పార్టీ తరపున ఆయన భార్య రీటా చౌదరీ బరిలో నిలిచారు. ధౌల్పుర్ స్థానంలో బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన శోభారాణి కుష్వా కాంగ్రెస్ పార్టీ తరపున, ఆమె బావ శివ్‌చరణ్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.
నాగ్‌పూర్‌లో మాజీ ఎంపీ జ్యోతి మిర్దా బీజేపీ నుంచి, ఆమె మామ హరేంద్ర మిర్దా కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. ఖేత్రీ స్థానంలో మనీషా గుర్జర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన సొంత బాబాయిపై పోటీ చేస్తున్నారు.