Uddhav Thackeray | ‘హిందువులను హిప్నటైజ్ చేసి దోచుకుంటున్నారు’.. అయోధ్య విరాళాల వివాదంపై ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామ మందిరానికి అందిన విరాళాలలో జరిగిన అవకతవకలపై ‘రామ రక్షా ఆందోళన్’ను ఆయన ప్రారంభించారు.
ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. (Uddhav Thackeray) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామ మందిరానికి అందిన విరాళాలలో జరిగిన అవకతవకలపై ‘రామ రక్షా ఆందోళన్’ను ఆయన ప్రారంభించారు. ఆదివారం ముంబైలోని దాదర్‌లో వందలాది మంది శివసేన (యూబీటీ) కార్యకర్తలతో కలిసి రామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, మారుతీ స్తోత్రం పఠించారు.
కాగా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘హిందువులను దోచుకుంటోందని’ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందువులను దోచుకుంటున్న ప్రభుత్వం. ఇది కేదార్నాథ్-బద్రీనాథ్‌తో మొదలైంది. ఇప్పుడు అయోధ్య వంతు. అయోధ్య ఒక ట్రైలర్ మాత్రమే. కాశీ, మధుర ఇంకా చాలా ఉన్నాయని వారు అంటారు. అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని అన్నారు.
మరోవైపు హిందువులను దోచుకుంటున్న హిందువులు అధికారంలో ఉండటం దురదృష్టకరమని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. ‘మేము పరాక్రమవంతులం, అమాయకులం, దేశాన్ని ప్రేమించే హిందువులం, కానీ మూర్ఖులం కాదు’ అని అన్నారు. ‘ఈ రోజు హిందువులు మాయలో పడ్డారు. దేశంలోని హిందువులంతా మేల్కొని, శ్రీరాముడిని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడాలని నేను కోరుతున్నా’ అని పిలుపునిచ్చారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ‘రామ రక్షా ఆందోళన్’ కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya
- BJP
- Centre
- donation row
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

