న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన సమాజ్వాది పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ బుద్ధిస్ట్, బహుజన హక్కుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ అనేది మతం కాదు.. అదొక మోసం, మరికొంత మందికి ఉపాధి అని విమర్శించారు.
దళితులు, గిరిజనులు, బీసీలను హిందువుల పేరిట ఓట్ల కోసం వాడుకుంటూ కుట్ర చేస్తున్నారని అన్నారు. హిందూ అన్నది మతం కాదని, అదో జీవన విధానం అని 1955లో సుప్రీంకోర్టు పేర్కొన్నదని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విధంగా పేర్కొన్నారని చెప్పారు.