ప్రయాగ్రాజ్: రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహ నమోదు చేసుకోనంత మాత్రాన వివాహం చెల్లకుండా పోదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ వివాహానికి సంబంధించిన సౌకర్యవంతమైన రుజువుగా మాత్రమే అటువంటి రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుందని జస్టిస్ మనీష్ నిగమ్ ఆగస్టు 26న వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సునీల్ దూబే అనే వ్యక్తి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆజంగఢ్లోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు పక్కనపెట్టింది. హిందూ వివాహ చట్టం-1955 నిబంధనల కింద వివాహానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపింది.