బెంగుళూరు: కర్నాటక(Karnataka)లోని హనగల్‌లో ఓ జంటపై అటాక్ జరిగింది. లాడ్జిలో ఉన్న భిన్నమతాలకు చెందిన జంటపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ముస్లిం వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హనగల్ తాలూకలోని నాల్కర్ క్రాస్ వద్ద ఉన్న ఓ హోటల్ రూమ్ లో హిందూ వ్యక్తి, ముస్లిం మహిళ ఉన్నారు. ఆ జంట ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి తాలూకా నివాసితులు. అఫ్తాబ్ మక్బూల్ అహ్మద్ చందకంటి, మద్రసాబ్ మహమ్మద్ ఇసాక్ మందకి, సమియుల్లా లలానావర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ ఆదివారం హోటల్ రూమ్‌లోకి వెళ్లి జంపై అటాక్ చేశారు. మోరల్ పోలీసింగ్ ఇస్తున్న వీడియో కూడా ఒకటి వైరల్ అయ్యింది. అయితే హోటల్లోని రూమ్ భాయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్య తీసుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపడుతున్నారు.