చెన్నై: హిందీకి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో స్థానం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. గతంలో హిందీ వ్యతిరేక ఆందోళనలో ప్రాణాలను త్యాగం చేసిన భాషా అమర వీరులను ఆయన ప్రశంసించారు.
భాషా అమర వీరుల దినం సందర్భంగా ఆందోళనలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి ఆదివారం ఆయన నివాళి అర్పించారు. హిందీ వ్యతిరేక ఆందోళనకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.