న్యూఢిల్లీ, నవంబర్ 13: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ హెచ్వి.1 వేగంగా వ్యాపిస్తున్నది. ఈజీ.5(ఎరిస్) లాంటి ఇతర రకాల కంటే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచే ఇది పుట్టిందని వైద్యాధికారులు తెలిపారు.
అక్టోబర్లో దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్-19 కేసుల్లో పావు భాగానికి పైగా హెచ్వి.1 కేసులే ఉన్నాయి. గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు, తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు ఈ వేరియంట్ లక్షణాలని వైద్యులు తెలిపారు. అయితే మిగతా వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెప్పారు.