న్యూఢిల్లీ: ఎల్నినో పరిస్థితులు బలపడుతున్న క్రమంలో నవంబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ మంగళవారం పేర్కొన్నది. ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ నవంబర్లో దేశం మొత్తంగా చూస్తే సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.
మరోవైపు దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ఈ ఏడాది అక్టోబరులో అతి తక్కువగా నమోదైంది.