Diabetes | న్యూఢిల్లీ: కండరాలు బలంగా ఉంటే, మధుమేహం ముప్పు 44 శాతం తగ్గుతుందని వెల్లడైంది. యూకే బయోబ్యాంక్ నుంచి 1.4 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి హాంకాంగ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయం తేల్చారు. మధుమేహం ముప్పు అధికంగా ఉన్నవారి కండరాలు బలంగా ఉంటే, మధుమేహం ముప్పు వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు.
ఈ అధ్యయన నివేదిక బయోమెడ్ సెంట్రల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. హాంకాంగ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యంగ్వన్ కిమ్ మాట్లాడుతూ, వారానికి రెండు రోజులు, 150-300 నిమిషాలపాటు కండరాల పటిష్టత కోసం కృషి చేయాలని తెలిపారు. కండరాల పటిష్టత ఓవరాల్ ఫిట్నెస్కు ముఖ్యమని చెప్పారు. నడి వయసు నుంచి వృద్ధాప్యం వరకు టైప్-2 మధుమేహం ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలిందని ఆయన చెప్పారు.