కొవాగ్జిన్ రెండు డోసులతో… అధిక రోగనిరోధక ప్రతిస్పందన: ఐసీఎంఆర్ స్టడీ
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ రెండు డోసులతో అధిక రోగనిరోధక ప్రతిస్పందనను గుర్తించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బీటా, డెల్టా, ఒమిక్రాన్ వంటి ఆందోళకర వేరియంట్లను ఎదుర్కోవడంలో ఈ టీకా ద్వారా పురోగతిని సాధించినట్లు ఒక అధ్యయనంలో పేర్కొంది. కొవాగ్జిన్ టీకా వల్ల లభించిన గణనీయమైన రోగనిరోధక శక్తి, కరోనా నుంచి కోలుకున్న వారిలో కూడా గుర్తించినట్లు తెలిపింది. అయితే కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో, రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుదల చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయంలో పరిశీలించినట్లు పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ లేదా ప్రికాషనరీ డోసు ప్రాముఖ్యత ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశమని ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ ప్రజ్ఞా యాదవ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో థర్డ్ వేవ్ అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అధ్యయనం నిర్వహించినట్లు చెప్పారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థతను పరిశీలించేందుకు ఈ స్టడీ చేపట్టినట్లు వివరించారు.
అయితే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందన తక్కువగా ఉన్నప్పటికీ, తీవ్రమైన వ్యాధికి గురిచేయడం, ఆసుపత్రిలో చేరడంతోపాటు మరణాల నుంచి వ్యక్తులను ఇది కాపాడిందన్నారు. ఈ అధ్యయనం ఫలితాలను ఈ నెల 5న జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

