జైపూర్: ఎన్నికల అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లొంగిపోనని చెప్పాడు. పోలీసులను చుట్టుముట్టాలని తన మద్దతుదారులకు సూచించాడు. దీంతో వారు టైర్లకు నిప్పు పెట్టి రోడ్డును బ్లాక్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో షీల్డ్లు ధరించిన పోలీసులు చివరకు హైడ్రామా మధ్య ఆ అభ్యర్థిని అరెస్ట్ చేశారు. (Rajasthan Candidate Arrest) రాజస్థాన్లోని డియోలీ-యునియారా అసెంబ్లీ స్థానానికి బుధవారం ఉపఎన్నిక జరిగింది. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికల అధికారి అయిన ఎస్డీఎం అమిత్ చౌదరి చెంపపై స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా కొట్టాడు. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే మీనా మద్దతుదారులు రెచ్చిపోయారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో మీనా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
కాగా, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని అభ్యర్థి నరేష్ మీనా కొట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం అతడ్ని అరెస్ట్ చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. అయితే తాను లొంగిపోనని మీడియాతో మీనా అన్నాడు. అలాగే పోలీసులను చుట్టుముట్టాలని, రోడ్డును బ్లాక్ చేయాలని తన మద్దతుదారులను ఉసిగొల్పాడు.
మరోవైపు పోలీసులు ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టారు. అల్లర్ల నిరోధక వాహనాలతో ఆ గ్రామానికి చేరుకున్నారు. షీల్డ్లు, రక్షణ దుస్తులు, హెల్మెట్లు ధరించిన పోలీసులు లాఠీలతో వచ్చారు. టైర్లతో మంటలు పెట్టి బ్లాక్ చేసిన రోడ్డును దాటి ముందుకు వెళ్లారు. పదుల సంఖ్యలో పోలీసులు నరేష్ మీనాను చుట్టుముట్టి అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ రక్షణ వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ హైడ్రామాకు చెందిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#WATCH | Tonk, Rajasthan: “I will not surrender,” says Naresh Meena, as police reaches Samravata VIllage to arrest him. pic.twitter.com/AN6T9qSQPf
— ANI (@ANI) November 14, 2024
#WATCH | Tonk, Rajastha: Police arrests Naresh Meena from Samravata VIllage.
Naresh Meena, independent candidate for Deoli Uniara assembly constituency by-polls in Tonk district, after he allegedly physically assaulted SDM Amit Chaudhary at a polling booth yesterday pic.twitter.com/v8meme4qsw
— ANI (@ANI) November 14, 2024