బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొత్త చిక్కుల్లో పడ్డారు. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)లో అక్రమ భూ కేటాయింపు కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు నోటీసులు జారీచేయాలని కర్ణాటక హైకోర్టు గురువారం ఆదేశించింది. ముడా కుంభకోణాన్ని దర్యాప్తు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
కేసు తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదావేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి రూ. 100 కోట్ల విలువైన 92 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో జప్తు చేసింది.