Hero Siddharth | బొమ్మరిల్లు సిద్దార్థ్‌కు మధురైలో అవమానం.. హిందీలో మాట్లాడి ఇబ్బంది పెట్టిన సీఆర్పీఎఫ్ సిబ్బంది
Hero Siddharth | హీరో సిద్దార్థ్‌కు మధురై విమానాశ్రయంలో అవమానం ఎదురైంది. వృద్ధ తల్లిదండ్రులతో కలిసి బయటకు వస్తుండగా జేబులు, బ్యాగులు చెక్ చేసి నాణేలు బయటకు తీయాలని హిందీలో ఆదేశించారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలన్నా వినకుండా హిందీలో పరుషంగా మాట్లాడారని సిద్దార్థ్ ఆరోపించారు.
Hero Siddharth | బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్‌కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా అడ్డుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది.. అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని ఎంతగా వేడుకున్నా కనకరించలేదు. ఈ ఘటనపై విమానాశ్రయంలో అధికారులకు సిద్దార్థ్ ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా బహిర్గతపరిచారు.
మంగళవారం మధ్యాహ్నం మధురై ఎయిర్‌పోర్టులో నటుడు సిద్దార్థ్‌ను సీఆర్పీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయన వెంట వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పెద్ద వయసు తల్లిదండ్రుల జేబులు, సంచుల్లో నుంచి నగదును తీయాలని ఆర్డర్ వేశారు. హిందీలో మాట్లాడుతూ అసహనం కలిగేలా ప్రవర్తించారు. అధికారులు పదే పదే హిందీలో మాట్లాడటంతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరినప్పటికీ నిరాకరించారు.
20 నిమిషాల పాటు తన తల్లిదండ్రులను సీఆర్పీ సిబ్బంది అవమానించారని, తనను కూడా వేధింపులకు గురిచేశారని సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికపై ఆరోపించారు. ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్న సీఆర్పీ సిబ్బంది.. ఎలాంటి పనిలేకుండా తమపై అధికారాన్ని ప్రదర్శించారని తనకు అనిపించిందని సిద్దార్థ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు సిద్దార్థ్ తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

