న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, లడఖ్, ఈశాన్య హిమాచల్ ప్రదేశ్లలో ఆదివారం భారీగా మంచు కురిసింది. ఇక్కడ ఎత్తయిన ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ హిమపాతం, వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ మంచు తుఫానులు కూడా వస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో చలి ఎక్కువైంది.
అక్కడ ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు ఉష్ణోగ్రత కన్నా 1.3 డిగ్రీలు ఎక్కువ. గరిష్ఠ ఉష్ణోగ్రత 18.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఢిల్లీలో సోమవారం ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చునని సూచించింది.