Hydrogel | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: బ్యాటరీల సాయంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కటం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బ తింటుంటాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. అదే హైడ్రోజెల్.
దీని ద్వారా ఎలక్ట్రానిక్ పరికరం త్వరగా చల్లబడటమేగాక.. దాని వేడి నుంచి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ హైడ్రోజెల్ నీరు, నిర్దిష్ట అయాన్లతో నిండిన పాలియాక్రిలమైడ్ ఫ్రేమ్ వర్క్‌తో ఉంటుంది.