చెన్నై: తిరుగుతున్న పెద్ద జెయింట్ వీల్ ఉన్నట్టుండి ఒక పక్కకు ఒరిగిపోయింది. (ferris wheel tilts) దీంతో దానిని ఆపేశారు. ఈ నేపథ్యంలో ఆ జెయింట్ వీల్ ఎక్కిన వారు భయాందోళన చెందారు. పోలీసులు వెంటనే స్పందించారు. ఒక్కొక్కరిని సురక్షితంగా కిందకు దించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుపత్తూరులో ఈ సంఘటన జరిగింది. శనివారం
పసిలికుడైలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆది పెరుక్కు వేడుక నిర్వహించారు. దీంతో స్వామి వారిని దర్శించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
కాగా, ఈ వేడుక సందర్భంగా ఆ ఆలయం వద్ద ఫెర్రిస్ను ఏర్పాటు చేశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న జెయింట్ వీల్ తిరుగుతుండగా ఒక్కసారిగా ఎడమవైపునకు వంగిపోయింది. దీంతో దానిపై ఎక్కిన వారు భయంతో హాహాకారాలు చేశారు.
మరోవైపు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. ఫెర్రిస్ వీల్‌ను ఆపివేశారు. పైన ఉన్న పిల్లలు, పెద్దలను సురక్షితంగా కిందకు చేర్చారు. ఈ సందర్భంగా వారంతా భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A 50-foot-high Ferris wheel caused panic among the public when it malfunctioned midway and tilted to its left in Tamil Nadu’s Thirupathur.
The giant wheel was one of the attractions for the thousands of devotees who had visited the Subramania Swamy Temple in Pasilikudai to… pic.twitter.com/h3tyTcYAiM
— IndiaToday (@IndiaToday) August 4, 2024