న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కౌంటర్ ఇచ్చారు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. నేను కూడా వినమ్రంగా మీకు ఓ సలహా ఇవ్వాలని అనుకుంటున్నాను మన్మోహన్సింగ్ జీ. మీలాంటి హోదా ఉన్న వ్యక్తి కాస్త మెరుగైన సలహాదారులను పెట్టుకోవచ్చు. మీరు లేఖలో సూచించిన అన్ని సూచనలను మేము వారం రోజుల ముందే అమలు చేశాము. దీనివల్ల తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే.. అప్డేట్గా ఉండటం వల్ల విలువ ఉంటుంది అని హర్షవర్ధన్ చాలా ఘాటుగా స్పందించారు.
అంతేకాదు మీ సలహాలను మీ పార్టీ వాళ్లే పాటించి, సహకరించి ఉంటే చరిత్ర మీపై కాస్తయినా దయ చూపేది అంటూ మరో ట్వీట్ చేశారు. మన్మోహన్ లేఖకు తాను ఇచ్చిన సమాధానానికి సంబంధించిన లేఖను కూడా హర్షవర్ధన్ పోస్ట్ చేశారు. వ్యాక్సిన్లను మరింత ఎక్కువ మందికి చేరేలా చూడాలంటూ ఆదివారం ప్రధాని మోదీకి మన్మోహన్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
History shall be kinder to you Dr Manmohan Singh ji if your offer of ‘constructive cooperation’ and valuable advice was followed by your @INCIndia leaders as well in such extraordinary times !
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 19, 2021
Here’s my reply to your letter to Hon’ble PM Sh @narendramodi ji 👍 @PMOIndia pic.twitter.com/IJcz3aL2mo
In all humility, a word of advice to you as well, Dr Manmohan Singh ji !
— Dr Harsh Vardhan (@drharshvardhan) April 19, 2021
A learned man of your stature could do well to surround himself with better advisors.
All suggestions given by you have been implemented a week prior to your letter.
PS : There's value in staying updated!
IPL 2021: రషీద్‌ఖాన్‌తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్‌కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు