హైదరాబాద్ : మరింత మందికి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో డానన్ ఇండియా సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. ఆప్టాగ్రో విడుదలతో బాలల ఆరోగ్య పానీయాల విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ ఉత్పత్తి 3-6 ఏండ్ల వయస్సున్న పిల్లల పోషకాహారాన్ని అందిస్తుంది. ఇది టేస్టీ చాక్లెట్, వెనిలా ఫ్లేవర్లలో లభిస్తుంది. అప్టాగ్రో ను 37 పోషకాలతో పిల్లల కోసం శాస్త్రీయంగా రూపొందించిన ఆరోగ్య పానీయం కాగా, ఇది పిల్లల శారీరక, మనో వికాసానికి ప్రత్యేకమైన ప్రీబయోటిక్స్,డిహెచ్ఏ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకమైన న్యూట్రీ-అబ్సార్బ్ సూత్రంతో, మెరుగైన వృద్ధికి తోడ్పడే కీలక పోషకాలను అందిస్తుంది.
మామ్స్ప్రెస్సో 1200 మంది పట్టనాలలో వుండే తల్లులతో ఇటీవల నిర్వహించిన సమీక్షలో 80శాతం మంది తల్లులు తమ బిడ్డ ఎదుగుదల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 69శాతం మంది తమ బిడ్డ తాము ఆశించిన స్థాయిలో ఎదగడం లేదని అభిప్రాయపడ్డారు. మరో 73శాతం మంది తల్లులు సరైన పోషకాలు తీసుకోకపోవడంతో తమ బిడ్డల ఎదుగుదల మరీ బలహీనంగా ఉందని చెబుతున్నారు. ఈ సర్వేలో వారు వ్యక్తం చేసిన మొదటి 3 ఆందోళనల్లో ఎత్తు, కండరాల వృద్ధి ,మానసిక వికాసం ప్రధానంగా ఉన్నాయి. అందుకోసమే అప్టాగ్రోను ఎదుగుతున్న భారతీయ చిన్నారుల పోషకాహార అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు.
ఇందులో 100శాతం ప్రోటీన్, కాల్షియం, ఎత్తు పెరిగేందుకుప్రీబయోటిక్స్, విటమిన్ ఏ,సీ,డీ లు రోగనిరోధకశక్తికి, డిహెచ్ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ &అయోడిన్ మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ కొవ్వు తక్కువ ఉండే ఈ పానీయం పిల్లలు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహకరిస్తుంది. డానన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు బక్షి మాట్లాడుతూ, “డానన్లో జీవితంలోని ప్రతి దశలోనూ వినియోగదారుల పోషకాహార అవసరాలు, అంచనాలకు అనుగుణంగా ఉత్పత్తులను, సేవలను ఆవిష్కరించి అందించడమే మా లక్ష్యం. దీన్ని విడుదల చేయడం ద్వారా చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లకు మద్దతు ఇవ్వడమే మా ఉద్దేశం” అని అన్నారు.