గ్యాంగ్‌స్టర్ ఆనంద్ విడుదలపై వివాదం
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల మార్చిన జైలు నిబంధనలతో ఆయన బయటపడనున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వివాదానికి తెరలేపింది.
- దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్య కేసులో దోషి
- రూల్స్ మార్చి విడుదల చేస్తున్న బీహార్ సర్కార్
- ఇది నేరస్థులను ప్రోత్సహించడమే
- కృష్ణయ్య భార్య ఉమా
పట్నా/హైదరాబాద్, ఏప్రిల్ 25: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న బీహార్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు. బీహార్ ప్రభుత్వం ఇటీవల మార్చిన జైలు నిబంధనలతో ఆయన బయటపడనున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వివాదానికి తెరలేపింది. ఆనంద్ మోహన్ విడుదల నేరస్థులను ప్రోత్సహించడమేనని, దీనిపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఆనంద్ మోహన్ కోసమే నితీశ్ ప్రభుత్వం జైలు నిబంధనలు మార్చిందని బీజేపీ, బీఎస్పీ ఆరోపిస్తున్నాయి.
నిబంధనలు మార్చిన బీహార్ ప్రభుత్వం
ఆనంద్ మోహన్‌సింగ్ గత 15 ఏండ్లుగా జైలులోనే ఉన్నారు. బీహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు మాన్యువల్-2012ను మార్చింది. ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల్లో శిక్ష పడిన వారిని సత్ప్రవర్తన కింద విడుదల చేయొద్దని చెబుతున్న 481వ నిబంధనను తీసేసింది. దీంతో ఆనంద్ మోహన్‌సింగ్ సహా 26 మంది జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.
కేసు పూర్వాపరాలు
ముజఫర్‌పూర్‌లో జరిగిన ఛోటన్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా.. తన అనుచరులను ఆనంద్ మోహన్ రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పాడు. దుండగుల దాడిలో దళిత ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని జోక్యం చేసుకోవాలి: ఉమా కృష్ణయ్య
ఆనంద్ మోహన్ విడుదల నిర్ణయాన్ని దివంగత దళిత ఐఏఎస్ కృష్ణయ్య సతీమణి ఉమా కృష్ణయ్య తప్పుపట్టారు. ఈ నిర్ణయం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుందని, నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని బీహార్ సీఎంకు చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

