న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, యువత నిరసనల అణచివేతపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరిందా? అని ప్రశ్నించారు. బుధవారం వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీక్పై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. గందరగోళం చెలరేగడంతో సభను వాయిదా వేసినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులను మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు.
కాగా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్ మాట్లాడేందుకు లోక్సభ స్పీకర్ అనుమతించడంపై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సీటు నుంచి పైకి లేచిన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మీరు వారికి (కాంగ్రెస్), వీరికి (బీజేపీ) మాట్లాడే అవకాశం ఇచ్చారు. మరి మా సంగతి ఏంటి? ప్రభుత్వం ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నదా? మీ మధ్య ఏదైనా అవగాహన ఉన్నదా?’ అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ లేదా బీజేపీకి సంబంధించిన సమస్య కాదని, దేశంలోని విద్యార్థులకు సంబంధించిన సమస్య అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎంపీలు ఆయనకు మద్దతుగా నిలిచారు.
VIDEO | Speaking in the Lok Sabha, Samajwadi Party MP Akhilesh Yadav, says, “This is not an issue of Congress, Samajwadi Party, BJP… this is an issue of students, youths. The way government has behaved… students were thrashed. We were compelled to hold protest outside the… pic.twitter.com/EoCQUtFAoG
— Press Trust of India (@PTI_News) July 22, 2026