Hathras stampede | ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ లో ఈ నెల రెండో తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్‌కు స్థానిక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై పట్టణంలోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ లో మధుకర్ మీద కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తన క్లయింట్ ఢిల్లీలో పోలీసులకు సరెండర్ అయ్యారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారంటూ మధుకర్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘హత్రాస్ తొక్కిసలాట ఘటన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ శనివారం ఢిల్లీలో సిట్, ఎస్టీఎఫ్ పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు’ అని ఏపీ సింగ్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
‘మేమేమీ తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోం అని వాగ్ధానం చేస్తున్నాం. ఆయన ఇంజినీర్, హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న రోగి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. విచారణలో దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు శనివారం పోలీసులకు లొంగిపోయారు’ అని ఏపీ సింగ్ తెలిపారు. ఈ ఘటన వెనుక సంఘ విద్రోహుల కుట్ర ఉందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేవ్ ప్రకాశ్ మధుకర్ కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు రూ. లక్ష రివార్డు ప్రకటించారు. గురువారం వరకూ ఇద్దరు మహిళా వాలంటర్లతోపాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురాజ్ పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలేబాబా సత్సంగ్ కార్యక్రమం నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీలో ఈ ఆరుగురు ఉన్నారు.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!