Haryana elections : హర్యానా (Haryana) లోని 90 అసెంబ్లీ స్థానాలకు (Assembly constituencies) రేపే (అక్టోబర్ 5) పోలింగ్ (Polling) జరగనుంది. శనివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ (Election commission) అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సిబ్బంది కూడా తమతమ పోలింగ్ కేంద్రాలకు (Polling stations) చేరుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
జమ్ముకశ్మీర్లో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో విడతల వారీగా పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఆ మేరకు సెప్టెంబర్ 18న తొలి విడత, సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ నిర్వహించారు.
హర్యానాలో మాత్రం మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 8న ఓట్లు లెక్కించి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Ambala | Polling parties were sent to polling stations with EVMs for Haryana Assembly Elections 2024.
Tomorrow, on October 5, voting will be held for all 90 assembly seats of Haryana. pic.twitter.com/dzReFccdaF
— ANI (@ANI) October 4, 2024