Himani Narwal | చండీగఢ్, మార్చి 2: హర్యానాలోని రోహ్తక్ జిల్లా సాంప్లా బస్టాండ్‌లో శనివారం సూట్‌కేసులో ఒక మహిళ మృతదేహం కన్పించడం సంచలనం సృష్టించింది. మృతురాలిని రోహ్టెక్లోని విజయ్ నగర్లో నివసించే కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వల్ (22)గా గుర్తించారు. తన కుమార్తె మృతిపై మృతురాలి తల్లి అనుమానాలు వ్యక్తం చేసింది. పార్టీ వారే ఆమెను చంపి ఉంటారని ఆరోపించింది. కార్యకర్త మృతిపై కాంగ్రెస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
కాగా, ఎన్నికలు, పార్టీయే తన కుమార్తె ప్రాణం తీశాయని మృతురాలి తల్లి ఆరోపించింది. తన కూతురి మరణానికి పార్టీలోని వారో, లేకపోతే ఆమె స్నేహితులో కారణం కావచ్చునని ఆమె సందేహం వ్యక్తం చేశారు. తన కుమార్తె భూపీందర్ సింగ్ హుడా భార్య ఆషా హూడాతో చాలా సన్నిహితంగా ఉండేదని తెలిపారు. ఆమెకు న్యాయం జరిగే వరకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని చెప్పారు.