రాహుల్‌పై అసంతృప్తి లేదు… గుజరాత్ నేతలపైనే కోపం : హార్థిక్ పటేల్
తనకు రాహుల్, ప్రియాంకపై ఎలాంటి అసంతృప్తీ లేదని గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ స్పష్టం చేశారు. తన కోపమల్లా… గుజరాత్ నేతలపైనేనని పునరుద్ఘాటించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, ఇలాంటి సమయంలో అందరూ కలిసి పార్టీ కోసం కష్టపడాల్సింది పోయి, దీనికి వ్యతిరేకంగా నడుపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నిజాయితీ వ్యక్తులు, అత్యంత బలమైన వ్యక్తులతో కలిసి పనిచేయాలని, వారికి పదవులివ్వాలని అప్పుడే పార్టీ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ స్థాయిలో, కింది స్థాయిలో ఎవరైతే పని చేస్తారో, వారికే పార్టీలో పదవులివ్వాలని హార్థిక్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నడుస్తుందంతా ఎన్నికల సమయమేనని, అందరూ గ్రామాలకు, పట్టణాలకు వెళ్లా, పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక… ఓ కుటుంబంలో అసంతృప్తి రావడం సహజమని, గతంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని ఆయన గుర్తు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

