Harish Rana : పదమూడేళ్లుగా కోమాలో ఉంటూ జీవచ్చవంలా బతికిన హరీశ్ రానా (Harish Rana)కు విముక్తి లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అతడు కారుణ్య మరణం (Passive Euthanasia)తో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. కారుణ్య మరణం నియమావళిని అనుసరించి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్(AIIMS)లో మంగళవారం రానాకు లైఫ్ సపోర్టును వైద్యులు నిలిపివేశారు. దాంతో, ఏళ్లుగా తనను, కన్నవాళ్లను ఎంతో క్షోభకు గురిచేస్తున్న బాధకు ఇంకా తనను వేధించే అవకాశమివ్వకుండా తుది శ్వాస విడిచాడు. తద్వారా కోర్టు ఆదేశాలతో కారుణ్య మరణం పొందిన తొలి భారతీయుడిగా హరీశ్ రానా పేరు చర్రితలో నిలిచిపోనుంది.
ఇంతకూ హరీశ్ రానాకు ఏమైంది?.. అశోక్ రానా, నిర్మాలా రానా దంపతుల సంతానమైన హరీశ్ రానా పంజాబ్ యూనివర్సిటీలో 2013లో బీటెక్ చదువుతున్నాడు. ఓరోజు అతడు ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడ్డాడు. ఆ ప్రమాదంలో రానా తలకు బలమై గాయాలయ్యాయి. ఆ గాయాల తీవ్రత కారణంగా అప్పటినుంచి అతడు అచేతన స్థితిలోనే ఉండిపోయాడు. తమ బిడ్డను ఎలాగైనా బతికించుకునేందుకు కన్నవాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు.
#BREAKING : Harish Rana has died at AIIMS Delhi after being in a coma for over 13 years. He was among the first individuals in India permitted passive euthanasia.#HarishRana #AIIMS #Euthanasia pic.twitter.com/ZG8MXCAhGk
— upuknews (@upuknews1) March 24, 2026
కుమారుడి వైద్య ఖర్చులు, మందుల కోసం తండ్రి అశోక్ స్కూటర్ మీద శాండ్ విచ్లు కూడా అమ్మాడు. కానీ వారి ప్రయత్నమూ నెరవేరలేదు. ఏ వైద్యమూ హరీశ్‌ను మునపటి మనిషిని చేయలేదు. దాంతో.. పదేళ్లకు పైగా కృత్రిమ ఆహారం, ఆక్సిజన్ సపోర్ట్‌తో బతికిన రానాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అతడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. మార్చి 11వ తేదీన హరీశ్ రానా కేసును విచారించిన అత్యున్నత ధర్మాసనం అతడి కారుణ్య మరణానికి అనుమతిచ్చింది.
Supreme Court allows withdrawal of medical treatment to 32-year-old Harish Rana, who has been in a vegetative state for the last 13 years with negligible hope of recovery.
Harish Rana’s father, Ashok Rana, says,” We had been fighting for this. Which parents would want this for… pic.twitter.com/KU9FFuJt3u
— ANI (@ANI) March 11, 2026
కారుణ్య మరణం కోసం ఘజియాబాద్ నుంచి మార్చి 14న హరీశ్‌ను ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడ అనస్తీషీయా, పల్లియేటివ్ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ సీమా మిశ్రా పర్యవేక్షణలో వైద్యుల బృందం హరీశ్‌కు లైఫ్ సపోర్టింగ్‌ను తీసేశారు. న్యూరో సర్జరీ, ఆంకో అనస్తీషియా, పల్లియేటివ్ మెడిసన్, సైకియాట్రీ వైద్యులు ఈ ప్రక్రియ సున్నితంగా, సాఫీగా జరిగేలా చూసుకున్నారు. దాంతో.. భారత్‌లో కోర్టు ఆదేశాలతో కారుణ్య మరణం పొందిన తొలి వ్యక్తిగా హరీశ్ రానా గుర్తింపు సాధించాడు.