New Governor’s | పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మిజోరాం ప్రస్తుత గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబును బదిలీ చేశారు. ఆయనను ఒడిశా గవర్నర్‌గా నియమించారు. బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్‌గా అజయ్‌కుమార్ భల్లా నియామకమయ్యారు. కేరళ గవర్నర్‌గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరాం గవర్నర్ జనరల్ డాక్టర్ విజయ్‌కుమార్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ల నియామకాలు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.