న్యూఢిల్లీ: వివాదాస్పద లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ను తాను కలిసిన విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అంగీకరించారు. ఎప్స్టీన్తో తనకు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఆయన బుధవారం లోక్సభలో స్పందిస్తూ తాను ఎప్స్టీన్ను మూడు నాలుగు సార్లు కలిసినట్టు చెప్పారు.
మల్టీలేటరిజమ్పై ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్ ప్రతినిధిగా తాను అతడిని కలిసినట్టు చెప్పారు. కేవలం వృత్తిపరమైన విధి నిర్వహణలో భాగంగానే అతడిని కలిశానని, అతనిపై వస్తున్న లైంగిక ఆరోపణలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.