టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన భజ్జీ.. సోమవారం నాడు మరికొందరు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు సినీ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు.
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, కపిల్ సిబల్, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, జావేద్ అలీ ఖాన్ తదితరులు కూడా సోమవారం నాడు ఎంపీలుగా బాధ్యతలు చేపట్టారు. పరుగుల రాణి పీటీ ఉష, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
ఈ క్రమంలో తను ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పంచుకున్న భజ్జీ.. ‘‘భారత రాజ్యాంగం, సభ మర్యాదలు కాపాడేందుకు రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాను. దేశప్రజలు, పంజాబ్ ప్రజల కోసం సాధ్యమైనంత కృషి చేస్తాను. జై హింద్ జై భారత్’’ అని ట్వీట్ చేశాడు.
Took Oath as Member of Parliament (Rajya Sabha) to protect the Constitution, Rule of Law and Dignity of the House . I will do my best for the people of Punjab and Nation .. Jai Hind Jai Bharat pic.twitter.com/5qkjHEQkn2
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 18, 2022