(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశంలో దళితులపై వేధింపులు, దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఉద్దేశించిన నేషనల్ హెల్ప్‌లైన్ అగైనిస్ట్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ను బట్టి ఈ విషయం అర్థమవుతున్నది.
2020లో ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి గత నెల 31 వరకూ ఏకంగా 6.34 లక్షల కైంప్లెంట్లు వచ్చినట్టు కేంద్రప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. బీజేపీపాలిత రాష్ర్టాల్లోనే దళితులపై ఎక్కువగా దారుణాలు జరుగుతున్నట్టు గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.