బెంగళూరు: ఒక వ్యక్తి మహిళ వెంటపడి ఆమెను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. (Happens In Big City) పెట్రోలింగ్‌ను మెరుగుపరచాలని నగర పోలీసులపై ఒత్తిడి చేస్తున్నానని ఆయన తెలిపారు. ‘పోలీస్ కమీషనర్‌కి రోజూ చెబుతూనే ఉంటా. జాగ్రత్తలు పాటించాలని. అన్ని ప్రాంతాలను పెట్రోలింగ్ ద్వారా పర్యవేక్షించాలని. దాదాపు రోజూ చెప్పే విషయమే. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటిపైనే పడుతుంది. పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంత పెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఈ ఉదయం కూడా కమీషనర్‌తో మాట్లాడాను. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని మీడియాతో అన్నారు.
కాగా, ఏప్రిల్ 4న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బెంగళూరులోని బీటీఎం లేఅవుట్ పరిసరాల్లో ఇరుకైన వీధిలో నడుస్తూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఒక వ్యక్తి వెంబడించాడు. వెనుక నుంచి ఒక మహిళను పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె ప్రతిఘటించింది. ఆమెను కాపాడేందుకు మరో మహిళ ప్రయత్నించడంతో అతడు పారిపోయాడు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బెంగళూరులో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా హోం మంత్రి పరమేశ్వర దీనిపై స్పందించిన తీరు మరింత ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే బాధిత మహిళలు ఫిర్యాదు చేయనప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.
The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8
— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025