Vijayadashami | ఉగ్ర సంస్ధ హమాస్ దిష్టిబొమ్మ దగ్ధం
విజయదశమిని (Vijayadashami) దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్న క్రమంలో మంగళవారం ఢిల్లీలో హమాస్ దిష్టిబొమ్మను పలువురు దగ్ధం చేశారు.
న్యూఢిల్లీ : విజయదశమిని (Vijayadashami) దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్న క్రమంలో మంగళవారం ఢిల్లీలో హమాస్ దిష్టిబొమ్మను పలువురు దగ్ధం చేశారు. ప్రీత్ విహార్ ప్రాంతంలో స్ధానికులు హమాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉగ్రవాదాన్ని అంతమొందించాలని నినాదాలతో హోరెత్తించారు. విజయదశమి సందర్భంగా ఏటా రావణ, కుంభకర్ణ, మేఘ్నాద్ వంటి రాక్షసుల దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్- ఉగ్రసంస్ధ హమాస్ ఫైటర్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడిని ఖండిస్తూ ప్రీత్ విహార్ ప్రాంత ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని నినదించారు. హమాస్ అమాయక పిల్లలు, ఇజ్రాయెల్ ప్రజలకు హాని కలిగిస్తోందని, వారిపై వేధింపులకు తెగబడుతోంది ఉగ్రసంస్ధ తీరు రాక్షసంగా ఉందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ దేశమైనా అమాయకులు, పిల్లను వేధింపులకు గురిచేస్తుందో వారిని తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. హమాస్ యుద్ధ నేరాలను వ్యతిరేకిస్తూ తాము రావణుడి దిష్టిబొమ్మ స్ధానంలో హమాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని స్ధానికులు తెలిపారు.
Read More :
Jammu Kashmir | ఒకే కాన్సులో నలుగురికి జన్మ.. గంటల వ్యవధిలోనే శిశువులందరూ మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- burnt
- Delhi
- Hamas effigy
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

